
24న సేవాలాల్ జయంతి వేడుకలు
కై లాస్‌నగర్: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈ నెల 24న పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ శాఖ ద్వారా నిరంతర కరెంట్ సరఫరా చేయాలన్నారు. అలాగే మున్సిపల్ ద్వారా రెండు రోజుల ముందు నుంచే శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ శాఖ ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్, పోలీస్ శాఖ ద్వారా బారికేడ్లు, బందో బస్తు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్, బంజారా ఉత్సవ కమిటీ చైర్మన్ భీమ్‌రావ్, ఐటీడీఏ డీడీ వసంత్‌రావు, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు
క్షయ రోగులకు పోషకాహార కిట్లు అందించేందుకు గ్లాండ్ పార్మా అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డా.స్నేహ శుక్లా మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,332 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను ఆ కంపెనీ ద్వారా అందించనున్నట్లుగా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత తదితరులున్నారు.
● కలెక్టర్ రాజర్షి షా
Comments
Please login to add a commentAdd a comment