
సరిహద్దుల్లో నిఘా
● ప్రత్యేక చెక్‌పోస్టులు..తనిఖీలు ● అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ● రూ.50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి
నిర్మల్‌ఖిల్లా: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల పరిధిలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 27న జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నగదు వ్యవహారాలు, తాయిలాలపై ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. నిర్మల్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘాతోపాటు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే తగిన ఆధారాలు, రశీదులు చూపాలని లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే రశీదులు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివాహ వేడుకల సీజన్‌లో వధూవరుల కుటుంబీకులు వస్త్రాలు, బంగారం, తదితర వస్తువులు కొనేందుకు నగదుతో వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రత్యేక చెక్‌పోస్టులు
నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సారంగాపూర్, తానూరు, కుభీర్ తది తర మండలాలతో అనుసంధానంగా ఉన్నా యి. ఆయా ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ము మ్మరం చేశారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు, బైక్‌లు వివిధ అవసరాల రీత్యా రాకపోకలు సాగిస్తుంటాయి.
బాసర మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో బాసర–ధర్మాబాద్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో వారం క్రితం వాహనాల తనిఖీ చేపట్టారు. ధర్మాబాద్ నుంచి బిద్రెల్లి వైపు వస్తున్న కుంటాల మండలానికి చెందిన వ్యక్తి కారులో రూ. 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో కేసు నమోదు చేశారు.
పది రోజుల క్రితం మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఓ వాహనాన్ని తానూరు మండలం బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.3 లక్షలకు పైగా నగదును గుర్తించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment