ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా? | - | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?

Published Wed, Feb 19 2025 2:48 PM | Last Updated on Wed, Feb 19 2025 2:48 PM

ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?

ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?

● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం

సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్‌: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్‌ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ‘రంజాన్‌కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్‌, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్‌లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్‌ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్‌ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్‌ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్‌ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

మంచిర్యాలలో దాదాగిరి

మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్‌ అన్నారు. ప్రభుత్వంలో టాప్‌ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్‌ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్‌ ఖాన్‌ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్‌ఖాన్‌ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్‌ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్‌ఖాన్‌ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్‌ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్‌ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్‌ కేసు, ఫార్ములా ఈ రేస్‌ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్‌...అదిగో అరెస్ట్‌ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్‌ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్‌ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement