
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
డ్రాపౌట్స్ ఎక్కువే..
విద్యారంగంలో ఇప్పటికీ చాలామందికి విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేక నమోదు క్రమంగా పడిపోతోంది. అంతేగాక డ్రాపౌట్స్ ఇంకా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండగా, మంచిర్యాలలో తక్కువగా ఉంది. విద్యార్థులకు టీచర్ల నిష్పత్తి తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం 1నుంచి 5వరకు ప్రతీ 30మంది విద్యార్థులకు ఒక టీచరు, 6నుంచి 8వరకు 35మందికి ఒక టీచరు ఉండాలి. కానీ అంతకంటే తక్కువగా ఉన్న విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్య అధికంగా ఉంది.
● ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయ సంఘాలు, సభ్యుల సంఖ్య పెరుగుతోంది. రుణ పరిమితి పెరుగుతూ క్రమంగా వృద్ధి కనిపిస్తోంది.
● వాహన రిజిస్ట్రేషన్లు పెరగడంతోపాటు ఇటీవల విద్యుత్ వాహనాలకొనుగోళ్లు పెరుగుతున్నాయి.
● మాతాశిశు సంరక్షణలో ఇంకా పోషకాహార లోపంతో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇప్పటికీ ఆయా కేంద్రాల్లో నమోదైన వారికి పూర్తి స్థాయిలో పోషకాహరం అందడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా వంద శాతం పోషకాహార రహితంగా మార్చేందుకు ఇంకెంత కా లం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి.
● ఉమ్మడి జిల్లాలో క్రమంగా జాతీయ రహదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఎన్‌హెచ్–44, 64, 363తోపాటు కొత్తగా పలు రోడ్లు అప్‌గ్రేడ్ కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతోంది.
డ్రాపౌట్ రేట్(శాతం)
జిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్
ప్రైమరీ
ఆదిలాబాద్ 1.29 4.97 16.54
ఆసిఫాబాద్ 1.80 7.39 16.39
మంచిర్యాల –0.14 2.60 20.39
నిర్మల్ 2.69 2.59 17.72
విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి
జిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్ హయ్యర్
ప్రైమరీ సెకండరీ
స్కూల్
ఆదిలాబాద్ 18 16 21 17
ఆసిఫాబాద్ 17 17 22 17
మంచిర్యాల 16 13 18 17
నిర్మల్ 18 15 18 17
Comments
Please login to add a commentAdd a comment