
గొర్రెలు ఎత్తుకెళ్లిన నలుగురి అరెస్టు
భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ శివా రులో గొర్రెలను ఎత్తుకెళ్లిన నలుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. పోలీసుస్టేషన్‌లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గొటూరుకు చెందిన పొర్ల నరేశ్..160 గొర్రెలను మేపడానికి ఇటీవల జన్కాపూర్‌కు వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు 33 గొర్రెలను ఎత్తుకెళ్లారని ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం కన్నెపల్లి సబ్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా బొలెరోలో గొర్రెలను తరలిస్తుండగా డ్రైవర్‌ను అదుపులో తీసుకుని విచారించారు. జన్కాపూర్‌కు చెందిన ప్రశాంత్, సంతోష్, అభిలాష్, సత్తన్న కలిసి గొర్రెలు విక్రయించారని తెలిపాడు. వాహనాన్ని సీజ్ చేసి, నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment