
వాహనం బోల్తా– ఒకరికి గాయాలు
పెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ లబ్జిరి గ్రామ సమీపంలో బుధవారం ఐస్‌క్రీం వాహనం బోల్తా పడిన ఘటనలో పెదబయలు గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి బి.చంద్రశేఖర్ ఐస్‌క్రీం వాహనంలో లబ్జిరి గ్రామం నుంచి పెదబయలు వస్తుండగా, అదుపు తప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐస్‌క్రీం ఫ్రీజర్ చంద్రశేఖర్‌పై పడడంతో తలకు బలమైన గాయంతో ఎడమచేయి విరిగింది. స్థానికులు స్పందించి ఆయనను హుటాహుటిన ఆటోలో పెదబయులు పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి నిఖిల్ ప్రాథమికి చికిత్స చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి 108లో తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment