
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
అరకులోయ టౌన్: అల్లూరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, సమష్టిగా పనిచేసి ప్రజావ్యతిరేక కూటమి ప్రభుత్యానికి బుద్ధి చెప్పాలని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అరకులోయలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడాగాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ చెప్పారాని.. అయితే కాలర్ పట్టుకుని అడుగుదామంటే టీడీపీ నాయకలు ఎవ్వరూ కనబడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదని, సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను అమలుచేయకుండా గాలికొదిలేశారన్నారు. ఈ తొమ్మిది నెలల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా రుజువైందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కాలర్ పట్టుకునే పరిస్థితి త్వరలో వస్తుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని అటువంటిది నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మన్యంలో ఒక్క అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, జిల్లా యువజన అధ్యక్షుడు ఎల్.బి.కిరణ్, అరకులోయ, డుంబ్రిగుడ వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, రామన్న, ఎంపీటీసీ సభ్యుడు బి.రామరావు, సర్పంచ్‌లు గుమ్మ నాగేశ్వరరావు, వెంకటరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సీహెచ్. మల్లేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, నాయకుడు రంజిత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
Comments
Please login to add a commentAdd a comment