
ఔరా
జీలుగు నీరా..
● ఫలించిన కేవీకే శాస్త్రవేత్తల పరిశోధనలు ● జీలుగు నీరాతో సిరప్, బెల్లం, ఇతర ఉత్పత్తుల తయారీ ● ఆధునిక పద్ధతుల్లో సేకరణపై దృష్టి ● గిరిజనులకు ఆదాయవనరుగా మార్చేందుకు చర్యలు ● కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ దిశానిర్దేశం
జీలుగు నీరా ిసిరప్
జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ మినహా అన్ని చోట్ల తాటి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఒక తాటి చెట్టు నుంచి రోజుకు నాలుగైదు లీటర్ల వరకు మాత్రమే కల్లు సేకరించగలరు. అదే జీలుగు చెట్టు నుంచి రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి కల్లును సొంతంగా వాడుకోవడంతో పాటు ఎక్కువగా ఉంటే దాని నుంచి చిగురు (కల్లును మరగబెట్టి ఆవిరి నుంచి తయారు చేసే సారా) తయారు చేసుకుంటారు. జీలుగు కల్లును మాత్రం గిరిజనుల నుంచి సేకరించి జిల్లాలో నలుమూలలతో పాటు మైదాన ప్రాంతాలకు వ్యాపారులు రవాణా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో జీలుగు కల్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం.
నీరా సేకరణ, ఉత్పత్తులపై శిక్షణ
జీలుగు నీరా, ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కేవీకేను సందర్శించిన కలెక్టర్ దినేష్‌కుమార్‌కు జీలుగు నీరా గురించి వివరించడంతో ఆయన వెంటనే స్పందించి, జిల్లాలో ఎన్ని జీలుగు చెట్లు ఉన్నాయో సమగ్ర సర్వే నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు. నీరా ఉత్పత్తిని జిల్లా అంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రణాళికలు తయారీ చేయాలని ఆదేశించారు. తాటి, జీలుగులను కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి.
–డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేవీకే కోఆర్డినేటర్,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడి
లా భా లు
లా భా లు
తాటికంటే అధికంగా కల్లు ఉత్పత్తి

ఔరా
Comments
Please login to add a commentAdd a comment