
ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు
● టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలి ● ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ స్వామినాయుడు
కొయ్యూరు: ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త(ఏపీసీ) స్వామినాయుడు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. టెన్త్, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. త్వరలో జరిగే పరీక్షల్లో సత్తా చాటాలన్నారు. పరీక్షలు ఎలా రాయాలో అవగాహన కల్పించారు. అనంతరం మెనూపై ఆరా తీశారు. ఎస్‌వో పరిమళ, ఎంఈవో రాంబాబు పాల్గొన్నారు
జ్ఞానజ్యోతి శిక్షణ పరిశీలన
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతంపై అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణకు ఆయన పరిశీలించారు.బోధన ఎలా చేయాలో వివరించారు. సీడీపీవో విజయకుమారి పాల్గొన్నారు
గంగవరం(అడ్డతీగల): మండలం కొత్తాడ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని బుధవారం సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థినులకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణపై ఆరా తీశారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థినులకు సూచించారు.8 వ తరగతి విద్యార్థినులకు పాల్ ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ఎంఈవో మల్లేశ్వరరావు,ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్ల జ్ఞానజ్యోతి శిక్షణ ఏపీసీ స్వామినాయుడు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment