
విద్యార్థులను పస్తులుంచిన ఉపాధ్యాయులు
● మధ్యాహ్న భోజనం పెట్టని టీచర్లు ● ఫిర్యాదు చేసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ● మెమో జారీ చేసిన ఎంఈవో
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు పస్తులుండవలసి వచ్చింది. ఈ విషయం గుర్తించిన జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ సోనియా ప్రసన్నకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల ఎదుట మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండడంతో గమనించిన ప్రసన్నకుమార్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా గ్రామంలో పండగ ఉండడంతో మధ్యాహ్న భోజనం పెట్టలేదని సమాధానం చెప్పారు. దీనిపై ఆయన మండల విద్యాశాఖాధికారి–2 రత్నకుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంఈవో మాకవరం ఎంపీపీ పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు మెమో జారీ చేశారు.మధ్యాహ్న భోజనం పెట్టకపోవడానికి కారణాలను 48 గంటల్లో తెలియజేయాలని ఆదేశించారు.

విద్యార్థులను పస్తులుంచిన ఉపాధ్యాయులు
Comments
Please login to add a commentAdd a comment