
ఆటలాడుతూ క్రీడాకారుడికి గాయాలు
గూడెంకొత్తవీధి(సీలేరు): వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడడంతో గిరిజన యువకుడు గాయపడిన ఘటన మండలంలోని దారకొండ పంచాయతీ చినగంగవరంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చినగంగవరం గ్రామానికి చెందిన కొర్రా ఆనందరావు బుధవారం గ్రామంలో వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతని కుడి చేయి దెబ్బతింది. సహచర క్రీడాకారులు హుటాహుటిన అతన్ని దారకొండ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి హిమబిందు ప్రాథమిక వైద్యం అందించారు. భుజం వద్ద జాయింట్ బాల్ పక్కకు జరిగినట్టు గుర్తించి అతన్ని మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment