Sakshi News home page

ఎండుతున్న ‘హరితహారం’

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మానుకోట నుంచి జమాండ్లపల్లికి వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా మొక్కలకు నీరందించి బతికించాలని వన ప్రేమికులు కోరుతున్నారు.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌టొప్పో, డేవిడ్‌తో కలిసి పోస్టల్‌ బ్యాలెట్లు, పోలింగ్‌ కేంద్రాలు, తదితర విషయాలపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమీక్షలో ఆర్డీఓలు అలివేలు, నర్సింహారావు, తహసీలార్లు తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం

సందర్శన

కురవి: సీరోలు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఏఓ అభిమన్యుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చే ముందు శుభ్రం చేయాలని సూచించారు. మట్టి పెళ్లలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ జైశ్రీ, డీపీఎం నళిని, ఏపీఎం సత్యనారాయణ, ఏఓ మంజుఖాన్‌, సీసీ రామారావు, ఏఈఓ శిరీష, రైతులు పాల్గొన్నారు.

స్కానింగ్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు

నెహ్రూసెంటర్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వహణ, పరిసరాలు, వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లోని ప్రతివార్డును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయుష్‌ ఆస్పత్రి, ఆరోగ్య ఆస్పత్రిలోని స్కానింగ్‌ సెంటర్‌, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేనందున షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి బిందుశ్రీ, డీపీహెచ్‌ఎన్‌ కావేటి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న వర్క్‌షాప్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌ రెండోరోజు శుక్రవారం కొనసాగింది. యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి వరలక్ష్మి మాట్లాడుతూ.. సరైన పరిశోధన అంశం ఎంపికతోనే పరిశోధనపై జిజ్ఞాస పెరుగుతుందన్నారు. పరిశోధన అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కామర్స్‌కళాశాల ప్రిన్సిపాల్‌ పి.అమరవేణి పాల్గొన్నారు.

1/3

2/3

3/3

Advertisement

homepage_300x250