Sakshi News home page

అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్ల పరిశీలన

Published Tue, May 7 2024 6:10 AM

అభ్యర

మహబూబాబాద్‌: మానుకోట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల రిజిస్టర్లను పరిశీలనకు తీసుకురావాలని ఆర్వో, కలెక్టర్‌ అద్వైత్‌మార్‌సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలను ఈ నెల 3న మొదటిసారి వ్యయపరిశీలకులు ఉమాకాంత్‌ ద్రుపాటి పరిశీలిస్తారని తెలిపారు. అలాగే 7న, 11వ తేదీన సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్లు వ్యయ రిజిస్టర్లతో హాజరుకావాలన్నారు. హాజరుకాని పక్షంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇన్‌చార్జ్‌ డీపీఆర్వోగా

ప్రేమలత

మహబూబాబాద్‌: జిల్లా ఇన్‌చార్జ్‌ డీపీఆర్వోగా బి.ప్రేమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రేమలతకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు.

నేడు జెడ్పీ స్థాయీ

సంఘాల సమావేశం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం 10గంటలకు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ జెడ్పీ సీఈఓ నర్మద గురువారం తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీ సభ్యులు సకాలంలో సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణకు

సహకరించాలి

గార్ల: పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని మహబూబా బాద్‌ డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన మద్దివంచ గ్రామంలో ఆయన ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికలు జరిగే సమయంలో పార్టీల నాయకులు ఎలాంటి గొడవలకు పోవద్దన్నారు. సదస్సులో గార్ల బయ్యారం సీఐ రవికుమార్‌, ఎస్సై జీనత్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాసరావు, నాయకులు గౌని భద్రయ్య, రాగం రమేష్‌, గౌని మల్లేశం, బిక్షమయ్య, జనార్దన్‌, లోకేష్‌, మాజీ సర్పంచ్‌ బాబూరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఎదుట

రెండు వర్గాల ఘర్షణ

చిన్నగూడూరు: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని విస్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశంలో రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం విస్సంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ఎమ్మె ల్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచా రం ఇవ్వట్లేదని వివాదం నెలకొంది. ఈక్రమంలో ఎమ్మెల్యే ఎదుటే ఇరువర్గాల నాయకులు ఘర్షణ పడ్డారు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో ఘర్షణ సద్దుమణిగింది.

అభ్యర్థుల ఖర్చుల  రిజిస్టర్ల పరిశీలన
1/1

అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్ల పరిశీలన

Advertisement

homepage_300x250