Sakshi News home page

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

Published Tue, May 7 2024 6:10 AM

-

మహబూబాబాద్‌ అర్బన్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 4వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి సమ్మెట సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు వివరాల కోసం కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజెపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్‌, ధర్మార్జున్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజేఎస్‌ పార్లమెంటరీ కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. మతం పేరుతో ప్రజలను విభజించే నైతికత ఎవరికి లేదని, పదేళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తు వచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రాజాస్వామిక వ్యవస్థలు కుప్పకూలిపోయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌కు టీజేఎస్‌ మద్దతు తెలుపుతుందని, మానుకోట అభ్యర్థి పోరి క బలరాంనాయక్‌ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు బైరి రమేశ్‌, గోపాగాని శంకర్‌రావు, పల్లె వినయ్‌, మహబూబాబాద్‌ పార్లమెంటరీ నాయకులు మల్లెల రామనాథం, పిల్లి సుధాకర్‌, ఆరుద్ర పరమాత్మ చారి, ఇరుగు మనోజ్‌, ఖాజాపాషా, రాజు, శంకర్‌, యాకూబ్‌ ఉన్నారు.

Advertisement

homepage_300x250