ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా Namibia's Ruben Trumpelmann made history by taking wickets in the first two deliveries of a T20 international. Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా

Published Mon, Jun 3 2024 11:57 AM

Namibias Ruben Trumpelmann creates historical record in T20 WC 2024

టీ20 వరల్డ్‌కప్‌-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్‌ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.

దీంతో మ్యాచ్‌ టై అయింది. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్‌ వీస్‌, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్‌ 6 బంతుల్లో వికెట్‌ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ కీలక పాత్ర పోషించాడు.

టీ20 క్రికెట్‌ చరిత్రలో..
ఇక ఈ మ్యాచ్‌లో నమీబియా పేసర్‌  ట్రంపెల్‌మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్‌ బ్యాటర్లకు ట్రంపెల్‌మన్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ ఆది నుంచే ఒమన్‌ బ్యాటర్లకు ఈ నమీబియన్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్‌మన్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.

ఈ క్రమంలో ట్రంపెల్‌మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్‌మన్‌ రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో  ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌ వేసిన ట్రంపెల్‌మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్‌ను ఔట్‌ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement