నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు..రాజశేఖర్‌ భార్య సుచరిత పిటిషన్‌ TSPSC Paper Leak Accused Wife Petition In Court | Sakshi
Sakshi News home page

నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు.. పేపర్‌ లీకేజీ నిందితుడు రాజశేఖర్‌ భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్‌ 

Published Tue, Mar 21 2023 8:13 AM | Last Updated on Tue, Mar 21 2023 3:28 PM

TSPSC Paper Leak Accused Wife Petition In Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో తన భర్త రాజశేఖర్‌ను నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘నా భర్తను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్‌ చేశారు. 14వ తేదీ వరకు రిమాండ్‌ చేయలేదు. నేరం ఒప్పుకోమని పోలీసులు నా భర్తపై ఒత్తిడి తెస్తున్నారు. నా భర్తను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్కడ ఆయనను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆ సమావేశం నుంచి వెళ్లేటప్పుడు నా భర్త కుంటుతూ నడుస్తున్నారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే ఆ పరిస్థితి వచ్చింది.

ఆరోగ్య పరిస్థితి తెలుకునేందుకు రాజశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్చాలి. ఆయనను సిట్‌ విచారణ చేస్తోంది. ఆ వీడియోను బయటపెట్టాలి. పోలీసుల చిత్ర హింసలపై, పేపర్‌ లీక్‌పై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలి. నా భర్తపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలి’అని ఆమె పిటిషన్‌లో కోరారు. ప్రతివాదులుగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిట్, హైదరాబాద్‌ నగర డీసీపీలను పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
చదవండి: రేవంత్‌కు సిట్‌ నోటీసులు.. మరోసారి కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

    వారం క్రితమే వివాహం.. గేమింగ్‌ జోన్‌లో అగ్నికి ఆహుతై..

    Published Mon, May 27 2024 1:49 PM | Last Updated on Mon, May 27 2024 1:49 PM

    Gaming Zone Fire Newly Married Couple Killed

    గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటన  పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.  ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి  ఉన్నారు. ఈ జంటకు వారం  క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్‌కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు.    

    24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు.  ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్‌కోట్‌కు వచ్చాడు.  గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు  గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షలకు తరలించారు.

    ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్‌పీ గేమింగ్‌ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు.

    No comments yet. Be the first to comment!
    Add a comment
Advertisement
 
Advertisement