ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్‌ కేసులో కవిత లాయర్‌ వాదనలు | Sakshi
Sakshi News home page

ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్‌ కేసులో కవిత లాయర్‌ వాదనలు

Published Mon, May 27 2024 10:02 AM

Delhi Liquor Case Updates: Delhi HC Hearing Kavitha Bail Plea Today

Delhi Liquor Case May 27 Updates


👉 కవిత బెయిల్‌ విచారణ రేపటికి వాయిదా

  • లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
  • రేపు మధ్యాహ్నాం 12గం. వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్ట్ 
  • ఇవాళ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ 
  • కవిత తరఫున ముగిసిన వాదనలు
  • 40 నిమిషాల పాటు వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాది
  • రేపు వాదనలు వినిపించనున్న ఈడీ, సీబీఐ

రేపు వాదనలు పూర్తయ్యాక.. తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ

 

👉కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్‌ స్వర్ణ కాంత

  • మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదు
  • కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదు
  • ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారు
  • బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి?: జస్టిస్‌ స్వర్ణకాంత
  • కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్‌ స్వర్ణకాంత
  • కవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు.. దాని వల్ల ఈడీకి వచ్చి లాభం ఏమిటి ?: కవిత తరఫు లాయర్‌ 

కవిత తరఫున  సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పూర్తి

👉పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?

  • కవితను అరెస్ట్‌ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పింది
  • సుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడింది
  • రాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారు
  • మా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది
  • సమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత
  • ఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదు
  • పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?
  • సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదు
  • ఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసింది
  • సీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత
  • మహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత
  • నేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత
  • బెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్‌ రిక్వెస్ట్‌లో కవిత

కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి


👉కేసు ఫైల్‌ చేసినప్పుడు పేరేది?

  • మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదు
  • కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదు
  • ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారు
  • బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జి
  • కేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జి
  • కవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలు
  • నేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చా
  • సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారు
  • నా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చాను
  • మహిళ ఫోన్‌లోకి తొంగి చూశారు
  • రైట్ టు ప్రైవసికి భంగం కలిగించారు
  • కొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చాను
  • ఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదు
  • కస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి  విచారణ జరపలేదు
  • ఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు
  • మాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారు
  • ఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు
  • ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు
  • అరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారు

కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి


ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభం

  • లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్ట్ లో విచారణ ప్రారంభం
  • కవిత బెయిల్ పిటిషన్  విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ
  • విచారణకు హాజరైన కవిత భర్త అనిల్


👉లిక్కర్‌ స్కామ్‌ కేసు.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఢిల్లీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. తద్వారా తాము వాదనలకు సిద్ధమని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటికే ఈడీ అరెస్ట్‌ చేసిన కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. లిక్కర్‌ కేసులో కవితని కింగ్ పిన్ అని పేర్కొంది సీబీఐ.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) నిరాకరించింది. దీంతో.. ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. మే 24 శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. కవిత తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తన వాదనలు వినిపించగా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగించేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈడీ, సీబీఐలకు వాదించేందుకు అవకాశం ఇచ్చింది.

మరోవైపు ఈడీ కౌంటర్‌ దాఖలు చేసి వాదనలకు సిద్ధమని ప్రకటించింది. అయితే సీబీఐ మాత్రం కౌంటర్‌కు, ఛార్జీషీట్‌ దాఖలుకు గడువు కోరింది. చెప్పినట్లుగానే సీబీఐ ఇవాళ కౌంటర్‌ వేసింది.

లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్‌ అయిన కవిత.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్‌ రిమాండ్‌ మీద తీహార్ జైల్లో  ఉన్నారు. 

సుప్రీంలో కేజ్రీవాల్‌ పిటిషన్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్‌ కేసులో తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  PET-CT స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో బెయిల్‌ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్‌ అభ్యర్థించారు. అయితే ఇప్పటికే ఆయనకు మాక్స్‌ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో కోర్టు బెయిల్‌ పొడిగిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

హైకోర్టుకే వెళ్లండి.. పిళ్లై బెయిల్‌పై సుప్రీం
సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు వింది. మధ్యంతర బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని పిళ్లైకి సూచించింది. అదే సమయంలో.. గతంలో ఇచ్చిన ఆదేశాల తో సంబంధం లేకుండా మధ్యంతర బెయిల్ పిటిషన్ పరిశీలన చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సైతం సుప్రీం సూచించింది.

గతంలో తాను కవిత బినామీనేనంటూ అరుణ్‌ పిళ్లై వాంగ్మూలం ఇచ్చి.. ఆ తర్వాత ఆ మాట మార్చాడు పిళ్లై. అయితే ఇండో స్పిరిట్ లో కవిత తరఫున పిళ్లై భాగస్వామిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది.

Advertisement
 
Advertisement