నీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి - | Sakshi
Sakshi News home page

నీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి

Published Wed, Apr 17 2024 1:30 AM

పారేవుల ఇంటెక్‌వెల్‌ పంప్‌హౌజ్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష  
 - Sakshi

మక్తల్‌: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పారేవుల వద్ద ఉన్న ఇంటెక్‌వెల్‌ను పరిశీలించారు. అదనపు మోటార్లు ఏర్పాటుచేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని మిషన్‌ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం పంపింగ్‌ కేంద్రం, హెడ్‌వర్క్స్‌, 10 ఎంఎల్‌డీ ఫిల్టర్‌బెడ్‌లను పరిశీలించారు. నిత్యం ఎన్ని ఎంఏఎల్‌డీ నీరు పంపింగ్‌ అవుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం చిట్యాల్‌లో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీల పేర్లను మస్టర్లలో నమోదు చేయాలన్నారు. మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీచేసి ప్రసవాల సంఖ్య పెంచాలని కోరారు. కొత్తగా వచ్చిన స్టాఫ్‌నర్సుల్లో అయిదుగురిని జిల్లా ఆస్పత్రికి పంపించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, శిక్షణ కలెక్టర్‌ గరిమా, మిషన్‌ భగీరథ అధికారులు తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement
 
Advertisement