16న ఉభయ రాష్ట్రాల భజన పోటీలు - | Sakshi
Sakshi News home page

16న ఉభయ రాష్ట్రాల భజన పోటీలు

Published Mon, Apr 15 2024 12:45 AM

-

ఎర్రవల్లిచౌరస్తా: ఎర్రవల్లి మండలంలోని దువాసిపల్లిలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన ఉభయ రాష్ట్రాల భజన పోటీలను నిర్వహించనున్నట్లు రామాంజనేయ భజన బృదం సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతుల కింద వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే, నాలుగు, ఐదు, ఆరో బహుమతులు ఇవ్వన్నుట్లు, పోటీల్లో పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలని, వివరాలకు సెల్‌ నం.9052671314ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement