‘కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు’ - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు’

Published Mon, Apr 15 2024 12:45 AM

భూత్పూర్‌లో మాట్లాతున్న ఎంపీ అభ్యర్థి 
మన్నె శ్రీనివాస్‌రెడ్డి  - Sakshi

భూత్పూర్‌: ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల పేరు చెబుతోందని, వాటిని నమ్మి మోసపోవద్దని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, అధైర్యపడకుండా ఉండాలని వారు సూచించారు. ఆదివారం భూతూ్‌ప్‌ర్‌లో నిర్వహించిన సమావేశంలో వారితోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు వంద రోజులకే కాంగ్రెస్‌ పాలనపై విసుగు చెందారని, మళ్లీ బీఆర్‌ఎస్‌ పాలన కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాలం గడుపుతారే తప్ప అమలు చేయడం వారి వల్ల కాదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడుల్లా రాముడి పేరుతో రాజకీయం చేస్తుందని, రాముడు వారికే కాదు మనందరికీ రాముడే అని, దేవుడి పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు ఇవ్వకుండా ఎంపీగా మళ్లీ గెలిపించడానికి కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలన ఏంటోనని ప్రజలకు అర్థమైందని, నాలుగు నెలల్లో తెలంగాణలో కరువుఛాయలు అలుముకున్నాయని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజ్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, నాయకులు నారాయణగౌడ్‌, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్‌, మహ్మద్‌ సాధిక్‌, సరోజ్‌రెడ్డి, ఖాజ, రామురాథోడ్‌, మాధవరెడ్డి, యాదిరెడ్డి, యాద య్య, వెంకట్రాములు, జాకీర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement