ఖజానా గలగల.. - | Sakshi
Sakshi News home page

ఖజానా గలగల..

Published Mon, Apr 15 2024 12:45 AM

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యం విక్రయాలు 
 - Sakshi

వివరాలు 8లో u

పేట మార్కెట్‌యార్డుకు లక్ష్యానికి మించి ఆదాయం

రూ.5.43 కోట్ల ఆదాయం

ఏడాది రూ.3.60 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.5.43 కోట్లు ఆదాయం వచ్చింది. పేట మార్కెట్‌యార్డుకు ఏటేటా లక్ష్యానికి మించి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మార్కెట్‌ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

– భారతి, మార్కెట్‌ కార్యదర్శి, నారాయణపేట

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో జోరుగా క్రయ, విక్రయాలు కొనసాగడంతో ఆదాయం గతేడాదికంటే ఈ ఏడాది పెరిగింది. జిల్లాలో వ్యవసాయ రంగంలో రైతులు వానాకాలం, యాసంగిలో పంటలతో పురోగతి సాధిస్తున్నారని చెప్పవచ్చు. కోస్గి, మక్తల్‌ మార్కెట్‌ యార్డులలో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నప్పటికీ చెక్‌పోస్టులు, రైస్‌మిల్లులు, కాటన్‌ మిల్లుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మార్కెట్‌ యార్డుల్లో జరిగిన ధాన్యం క్రయవిక్రయాలతో వచ్చిన ఆదాయంతో ఖజనా గలగలలాడుతుంది. ఈఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపుతో లక్ష్యానికి మించి ఆదాయం పెరిగింది.

పత్తి, వరి, కంది, వేరుశనగపైనే ఆదాయం..

జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం. రైతులు ప్రధానంగా పత్తి, వరి, కంది వేరుశనగ పంటలపై అసక్తి చూపి పండించిన పంటలకు నారాయణపేట, మక్తల్‌, కోస్గిలో వ్యవసాయ మార్కెట్లలో విక్రయించారు. క్రిష్ణ నది పరివాహకంలో నీటి వనరులు ఉండడం, చెరువులు, బోరు బావుల కింద పంటలను పండించారు.

లక్ష్యాన్ని మించి..

జిల్లాలో నారాయణపేట, మక్తల్‌, కోస్గి మూడు మార్కెట్‌యార్డుల్లో లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం వచ్చింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్‌, ఊట్కూర్‌ మండలాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని సమీప ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులతో వ్యాపార లావాదేవీలు జరగడంతో లక్ష్యానికి మించిన ఆదాయం సమకూరింది. ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పైనే మార్కెట్‌సెస్‌ అధికంగా రావడంతో పేట మార్కెట్‌కు ఏటేటా ఆదాయం పెరుగుతున్న ప్రస్తుతం ఉన్న గ్రేడ్‌ 2 నుంచి గ్రేడ్‌ 1కి మారుతుందానే ఆశాభావం అధికార యంత్రాంగం భావిస్తుంది.

చెక్‌పోస్టుల నుంచి ఆదాయం

జిల్లాలోని నారాయణపేట గంజ్‌ దగ్గర, మరికల్‌లో హైదరాబాద్‌రోడ్‌లో, మక్తల్‌ మార్కెట్‌ పరిధిలోని క్రిష్ణ మండలం టైరోడ్‌ దగ్గర, కోస్గిలో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. మార్కెట్‌ యార్డు పరిధిలోని చెక్‌పోస్టులతోనే మార్కెట్‌లకు అదనపు ఆదాయంతో ప్రతి ఏడాది రూ.లక్షల ఆదాయం వస్తుంది. జిల్లాకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో యాద్గీర్‌, క్రిష్ణ సరిహద్దులో శక్తినగర్‌ బార్డర్‌లో ఉన్నాయి. జిల్లా మీదుగా వెళ్లే ఈ వాహనాలు భారీగా మార్కెట్‌ సెస్‌ను వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్‌ మార్కెట్‌, కోస్గి మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాలు తక్కువగానే జరుగుతాయి. జిల్లాలోని 24 రైస్‌మిల్లులు, 6 కాటన్‌మిల్లులు, 1 దాల్‌మిల్‌, 37 మంది ఖరీదుదారులు, 55 మంది కమిషన్‌ ఏజెంట్లు నిర్వహించే క్రయ విక్రయాలతో మార్కెట్‌లకు ఆదాయం వస్తుందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా వేరుశనగ, పత్తి, వరి, కందిపైనే మార్కెట్‌సెస్‌

మక్తల్‌, కోస్గి మార్కెట్లకు చెక్‌పోస్టుల నుంచే అధికం..

1/1

Advertisement
 
Advertisement