2 Karnataka teens arrested for using fake gun while creating Instagram reel - Sakshi
Sakshi News home page

బైక్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. పిస్టల్‌తో హల్‌చల్‌ చేసిన యువకులు..

Published Sat, Jul 1 2023 3:39 PM

Karnataka: Police Arrested Youth Wheeling On A Bike With A Pistol - Sakshi

యశవంతపుర(బెంగళూరు): పిస్టల్‌ చేతపట్టి బైక్‌పై వీలింగ్‌ చేస్తున్న ఇద్దరు యువకులను హాసన పోలీసులు అరెస్ట్‌ చేశారు. హాసన రింగ్‌రోడ్డులో ఇద్దరు యువకులు బుల్లెట్‌ బైకుపై వీలింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌ పెట్టారు.

చదవండి: పూణే రైల్వే స్టేషన్లో దారుణం.. కనుమరుగైన మానవత్వం..

Advertisement
 
Advertisement