షూటింగ్‌లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు | Sakshi
Sakshi News home page

శ్రీవిష్ణుకు షాకిచ్చిన కూలీలు.. ఆ కారణంతో కారుని అడ్డగించి మరీ!

Published Wed, Jan 3 2024 7:32 AM

Labour Blocked Actor Sri Vishnu Car In New Movie Shooting Yaganti - Sakshi

తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)

ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్‌లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది.

గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement