పాఠశాల నుంచే దాడి?  Vivekananda School 20 feet away fromplace where attack | Sakshi
Sakshi News home page

పాఠశాల నుంచే దాడి? 

Published Sun, Apr 14 2024 4:33 AM | Last Updated on Sun, Apr 14 2024 4:33 AM

Vivekananda School 20 feet away fromplace where attack  - Sakshi

దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూలు 

మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తింపు 

పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్‌ టీడీపీ ఆఫీసు 

ఓ టీడీపీ నేత అనుచరుల వద్ద ఎయిర్‌గన్‌ వంటి మారణాయుధాలు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌లో వివేకానంద సెంటినరీ హైస్కూల్‌ నుంచే ఎయిర్‌గన్‌తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్‌ యాత్ర సాగుతోంది. సీఎం జగన్‌ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

పాఠశాలకు వాచ్‌మెన్‌ భద్రత లేదు. దీంతో  గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్‌ బ్యాచ్, ఎయిర్‌గన్‌లు, క్యాటర్‌బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్‌ రోడ్‌షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

    పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

    Published Mon, Jun 3 2024 9:36 PM | Last Updated on Fri, Jun 7 2024 5:02 PM

    CM YS Jagan Tweet On Counting Of AP Elections

    తాడేపల్లి:  ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు.  ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

    ‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

     

    No comments yet. Be the first to comment!
    Add a comment
Advertisement
 
Advertisement