తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య Female constable commits suicide | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published Mon, Jun 3 2024 7:24 AM | Last Updated on Mon, Jun 3 2024 7:24 AM

Female constable commits suicide

అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘటన  

రాయచోటి: అన్నమ­య్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

 వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయ­చోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

    పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

    Published Mon, Jun 3 2024 9:36 PM | Last Updated on Fri, Jun 7 2024 5:02 PM

    CM YS Jagan Tweet On Counting Of AP Elections

    తాడేపల్లి:  ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు.  ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

    ‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

     

    No comments yet. Be the first to comment!
    Add a comment
Advertisement
 
Advertisement