Sakshi News home page

● కలిమిలిని కలసిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ● గతంకంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామని వెల్లడి

Published Fri, Apr 19 2024 1:40 AM

కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి నివాసంలో మాట్లాడుతున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి - Sakshi

వెంకటగిరి రూరల్‌ : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా ఉందని, భవిష్యత్‌లో టీడీపీ టూలెట్‌ బోర్డులు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఎద్దేశా చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మార్సీరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డితో వెంకటగిరిలోని కలిమిలి నివాసంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి ఎంపీపీలు గూడూరు భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌, రూరల్‌ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కలిమిలి నివాసానికి విచ్చేసిన నేదురుమల్లికి డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో 175కి 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి సేవలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. అనంతరం వెంకటగిరి రాజాలు, ఎస్వీబీసీ చైర్మన్‌ డాక్టర్‌ వీబీ.సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దొంతుశారద, పట్టణ కన్వీనర్‌ జీ.ఢిల్లీబాబు, కౌన్సిలర్‌ ఆరి శంకరయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, పేచీరాజ్‌, తలపల మల్లికార్జున్‌, అల్లంసాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250