Sakshi News home page

ముసలోళ్ల గోడు వెంటాడుతుంది

Published Tue, May 7 2024 11:25 AM

ముసలో

మా మూసలోళ్ల పింఛన్‌పై చంద్రబాబు రాజకీయం చేయడం ఏమిటి. వేకువజామున తలుపుతట్టి 5 గంటలకే గ్రామ వలంటీర్లు ఇది వరకు పింఛన్‌ అందజేసేవారు. అయితే ఎన్నికల సాకుతో వలంటీరు వ్యవస్థను నిలుపుదల చేయించిన చంద్రబాబుకు మేము ఓట్ల రూపంలో బుద్ధి చెప్పుతాము. గత నెలలో సచివాలయాల దగ్గర ఇస్తే.. ఈ నెల బ్యాంకుల్లో జమచేశారని చెప్పారు. బ్యాంకు ఉన్న మండల కేంద్రానికి నేను నివాసం ఉన్న గ్రామానికి 10 కిలో మీటర్లు దూరం. అసలే మండుటెండల్లో నాలాంటి వృద్ధాప్యం ఉన్నవారు బ్యాంకులో క్యూలో నిలబడి తీసుకోవడం ఎంత కష్టం. ఇంతగా కష్టపెడుతున్న మా వృద్ధుల గోడు చంద్రబాబును వెంటాడక తప్పదు. ఎప్పుడు ఎప్పుడని జగనయ్య ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం. – సరోజనమ్మ,

నెలటూరు. వరదయ్యపాళెం మండలం

మళ్లీ పాత రోజులు

గుర్తుకొస్తున్నాయి

చంద్రబాబునాయుడు ప్రభుత్వ హాయంలో పింఛన్ల్‌ కోసం పంచాయతీ కార్యాలయాలు, పోస్టు ఆఫీసు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసేవాళ్లం. చంద్రబాబు కుట్రలతో మళ్లీ నేడు చంద్రబాబు పాలన గుర్తుకు వస్తోంది. వయసు మీదపడి నీరక్షరాస్యులమైన మేము నగదు ఎలా తీసుకోవాలి..? కనీసం బ్యాంకుల వద్ద నగదు తీసుకునేందుకు విత్‌డ్రా ఫారమ్‌ రాసి ఇచ్చే దిక్కులేదు. వందల కొద్దీ పింఛన్‌దారులు ఒక్కసారిగా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మేము పింఛన్‌ తీసుకోవడం సాధ్యమేనా. – అమ్మణమ్మ,

తాగేలి, వరదయ్యపాళెం మండలం

ముసలోళ్ల గోడు వెంటాడుతుంది
1/1

ముసలోళ్ల గోడు వెంటాడుతుంది

Advertisement

homepage_300x250