Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 4:15 PM

No Headline

చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రంగమ్మ. మండల కేంద్రం కొలిమిగుండ్లలోని పోస్టాఫీస్‌ సమీపంలో నివాసం ఉంటుంది. వయస్సు మీద పడటంతో పాటు కాలు విరగడంతో స్టాండ్‌ సాయంతో తీవ్రమైన ఎండలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు అతి కష్టంగా చేరుకుంది. ఓ వైపు ఎండలకు తాళలేక పోతేంటే మరో వైపు పింఛన్‌ కోసం ఇంతలా కష్టపెడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. గతంలో ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్లని, రెండు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. – కొలిమిగుండ్ల

ఇంత కష్టపెడతారా..

Advertisement

homepage_300x250