Sakshi News home page

నిప్పుల వర్షం

Published Tue, May 7 2024 4:15 PM

నిప్పుల వర్షం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. గురువారం భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా.. ఏకంగా 22 మండలాల్లో హీట్‌వేవ్‌ నమోదైంది. కర్నూలు జిల్లాలో గూడూరు, కౌతాళం మండలాల్లో హీట్‌ వేవ్‌ నమోదు కావడం గమనార్హం. వడగాడ్పుల తీవ్రతకు వృద్ధులు, బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్ల లు, రోగులు అల్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకుపైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్‌లలో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9, బండిఆత్మకూరులో 45.7, శ్రీశైలంలో 45.6, రుద్రవరంలో 45.5, పగిడ్యాలలో 45.3, ఆత్మకూరు, చాగలమర్రిలో 45.2, కొత్తపల్లిలో 45.1, శిరువెళ్లలో 45, గడివేములలో 44.9, పాములపాడు, అవుకులో 44.7, నంద్యాలలో 44.6 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలాల్లో హీట్‌వేవ్‌ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు, కర్నూలులో 45.3, కౌతాళంలో 44.9, ఎమ్మిగనూరులో 44.5, కోడుమూరులో 44.4 సి..బెళగల్‌లో 44.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో ఆళ్లగడ్డ, దొర్నిపాడు, నంద్యాల, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు మండలాల్లో హీట్‌వేవ్‌ నమోదయ్యే అవకాశం ఉంది.

బనగానపల్లి, డోన్‌లో 46.7 డిగ్రీలు

కర్నూలు, గూడూరుల్లో

45.3 డిగ్రీల ఉష్ణోగ్రత

Advertisement

homepage_300x250