Sakshi News home page

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

Published Tue, May 7 2024 1:45 PM

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేశ్‌కుమార్‌ వ్యాస్‌ అన్నారు. గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేశ్‌కుమార్‌ వ్యాస్‌, హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పోలింగ్‌ నిర్వహణ, సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్‌ యూనిట్ల కేటాయింపు పూర్తయిందని, ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్లు, ఎఫ్‌ఎస్‌సీ, ర్యాండమైజేషన్‌ పూర్తి చేయాలన్నారు. అలాగే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ సురేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీ కొనసాగుతుందని కలెక్టర్‌ వివరించారు. కంట్రోల్‌ రూం, సీ విజిల్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Advertisement

homepage_300x250