Sakshi News home page

నీటి నిల్వకు కుంటలు

Published Tue, May 7 2024 1:45 PM

నీటి నిల్వకు కుంటలు

● ఉపాధిహామీ పథకం కింద పంట పొలాల్లో తవ్వకం ● వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు ● భూగర్భ జలాల రక్షణే ధ్యేయం ● ఇప్పటివరకు 5,490 ఫామ్‌ పాండ్స్‌, 905 పీటీలు, ఎంపీటీలు పూర్తి

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): మారిన వాతావరణ పరిస్థితులతో భూగర్భ జలాలు ఏటా మరింత లోతుకు ఇంకిపోతున్నాయి. సాధారణ వర్షపాతమే నమోదవుతున్నా.. భూమిలో ఇంకే నీటిశాతం తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుతోపాటు రైతులకు అందుబాటులో నీటి వనరులు ఉంచేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నీటి కుంటల తవ్వకం చేపడుతోంది. పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫామ్‌ పాండ్స్‌, పీటీ, ఎంపీటీల తవ్వుతున్నారు. బహుళ ప్రయోజనాలు ఉండటంతో రైతులు సైతం స్వచ్ఛందంగా నీటి కుంటల తవ్వకానికి ముందుకొస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,490 ఫామ్‌ పాండ్స్‌, 905 పీటీలు, ఎంపీటీల తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 531 ఫామ్‌ పాండ్స్‌, 865 పీటీలు, ఎంపీటీల పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు నీటి నిల్వతో కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరిస్తున్నారు. పెద్దఎత్తున కుంటల తవ్వకాల వైపు వారు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. అధికంగా వర్షాలు కురిసే జిల్లాలో కుంటలు నిర్మించి జలాన్ని ఒడిసిపట్టడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు.

పుష్కలంగా నీరు..

జిలాల్లో రైతులు బావులు, బోరుబావుల కింద వరి, పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జ లాలను పెంచేందుకు ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లో ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉపాధికూలీలు ద్వా రా పంట పొలాలు, చేలలో కుంటల తవ్వకాలు చేపడుతోంది. పొలాల్లో నిర్మించిన కుంటలు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేస్తున్నాయి. వరదలకు భూమి కోతకు గురి కాకుండా.. పంట పొలాల్లోని సారవంతమైన నేలలు కొట్టుకుపోకుండా కూడా ఈ కుంటలు రక్షిస్తున్నాయి. మరోవైపు చెరువులు, కుంటల్లో తవ్వుతు న్న ఫామ్‌ పాండ్స్‌తో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. అధికారుల సూచనలతో రైతాంగం పెద్ద ఎ త్తున కుంటల తవ్వకాలకు మొగ్గు చూపుతున్నారు. భూగర్బ జలాలు పెరిగి భవిష్యత్తు తరాలకు అందించడానికి నీటి కుంటలు బాటలు వేస్తున్నాయి.

అవగాహన కల్పిస్తున్నాం

ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున కుంటలు, పీటీల తవ్వకాలు చేపడుతున్నాం. పంట పొలాల్లో నిర్మించే కుంటలతో రైతులకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే గ్రామసభల్లో వివరిస్తున్నాం. పంట చేలలో తవ్వే కుంటలతో భూగర్బ జలాలు పెరిగి రైతుల బోర్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. కుంటల తవ్వకాలను ఏటా పెద్దఎత్తున చేపడుతున్నాం. – సురేందర్‌, డీఆర్‌డీవో

జిల్లా వివరాలు

మండలం ఫామ్‌ పీటీలు/

పాండ్స్‌ ఎంపీటీలు

ఆసిఫాబాద్‌ 377 54

బెజ్జూర్‌ 595 04

చింతలమానెపల్లి 109 01

దహెగాం 307 04

జైనూర్‌ 300 20

కాగజ్‌నగర్‌ 540 27

కెరమెరి 329 257

కౌటాల 354 02

లింగాపూర్‌ 77 07

పెంచికల్‌పేట్‌ 195 03

రెబ్బెన 298 00

సిర్పూర్‌(టి) 1040 16

సిర్పూర్‌(యూ) 108 00

తిర్యాణి 568 24

వాంకిడి 293 486

Advertisement

homepage_300x250