Sakshi News home page

60 ఏళ్లలో అన్నీ అస్తవ్యస్తం

Published Tue, May 7 2024 3:10 AM

-

కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల కేంద్రం, రాష్ట్రంలో వాతావరణమార్పులు గురించి అధ్యయనం చేసింది. 1960 నుంచి 1990 వరకు, 1997 నుంచి 2017 వరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది రెండు భాగాలుగా చేసి అధ్యయనం చేసింది. సాధారణం కంటే ఎండలు, వర్షం, చలి, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత పెరిగినట్లు తెలిసింది. సరాసరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విపరీతంగా నగరీకరణ, వనాలను కొట్టివేస్తూ కాంక్రీటు కట్టడాలు రావడం, పరిశ్రమలు, వాహనాల కాలుష్యం, గ్యాస్‌వినియోగం పెరగడం పట్ల హెచ్చరించింది. వాతావరణ అసమతౌల్యం వల్ల విపరీతమైన ఎండలు వేడి, అకాలవర్షాలు, కరువు వంటివి ఏర్పడుతున్నట్లు తెలిపింది.

Advertisement

homepage_300x250