Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Published Tue, May 7 2024 5:00 AM

పోలింగ్‌ కేంద్రాల వద్ద  పటిష్ట బందోబస్తు

నార్పల/యల్లనూరు/పుట్లూరు: పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అన్నారు. గురువారం నార్పల, యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మినారాయణ, జయ ప్రసాద్‌, సీఐలు శ్రీధర్‌, సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ దస్తగిరి, ఈఓఆర్డీ రాముడు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో

ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు ఇకపై ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌, అదనపు విద్యార్హతలు చేసేందుకు నేరుగా కార్యాలయానికి వచ్చి ఇబ్బంది పడకుండా ఇంటి నుంచే సులభంగా పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఇతర కోర్సులు చేసిన వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే లాగిన్‌ వివరాలు, రిజిస్ట్రేషన్‌ నంబరు ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఎంప్లాయిమెంట్‌ కార్డు లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళ్యాణి విజ్ఞప్తి చేశారు.

న్యూస్‌రీల్‌

Advertisement

homepage_300x250