Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 5:00 AM

No He

సాక్షి, పుట్టపర్తి

న్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీ (శనివారం) జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుట్టేలా సీఎం సభ ఉండాలని నేతలు భావిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బి.నవీన్‌నిశ్చల్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం సీఎం జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హిందూపురానికి వెళ్తారు. అక్కడ సభ అనంతరం హెలికాప్టర్‌లో పలమనేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు.

సీఎం హెలిప్యాడ్‌ కోసం స్థల పరిశీలన..

హిందూపురం: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ హెలిప్యాడ్‌ ఏర్పాటు కోసం ఎంజీఎం గ్రౌండ్‌ను పరిశీలించారు. ఎస్‌డీజీఎస్‌ కళాశాల గ్రౌండ్‌ను కూడా పరిశీలించి హెలిప్యాడ్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అధికారుల వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి, కొల్లకుంట ఆనంద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

11 గంటలకు హిందూపురం

అంబేడ్కర్‌ సర్కిల్‌లో బహిరంగ సభ

హెలిప్యాడ్‌ కోసం స్థల పరిశీలన చేసిన ఎస్పీ మాధవరెడ్డి, జేసీ అభిషేక్‌ కుమార్‌

No Headline
1/1

No Headline

Advertisement

homepage_300x250