Sakshi News home page

ప్రశాంత నగరి..‘పచ్చ’ గూండాగిరి

Published Tue, May 7 2024 5:00 AM

ప్రశా

అనంతపురం: అనంతపురం నగరం ప్రశాంతతకు మారు పేరు. గొడవలు, కక్షలు, కార్పణ్యాలకు తావులేని ప్రాంతం. అలాంటి నగరంలో అలజడులు రేపేందుకు టీడీపీ నాయకులు పన్నాగాలు పన్నుతున్నారు. కాలనీల్లో ప్రజల మధ్య చిచ్చు రాజేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఎత్తుగడ వేస్తున్నారు.

ఆయనకు టికెట్‌తోనే బీజం..

రాప్తాడులో వైఎస్సార్‌సీపీ నేత భూమి రెడ్డి ప్రసాద్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడైన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అనంతపురం టీడీపీ టికెట్‌ కేటాయించడంతోనే అరాచక సంస్కృతికి బీజం పడినట్లయింది. టికెట్‌ ఖరారైన క్షణం నుంచే దగ్గుపాటి చుట్టూ రౌడీ షీటర్లు, హింసా ప్రవృత్తి గల వారు చేరిపోయారు. ఏకంగా రౌడీషీటర్లతోనే దగ్గుపాటి ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఆయన తన వెంట నేరస్తులను తీసుకెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉలిక్కిపడిన నగరం

రూరల్‌ పంచాయతీ పరిధిలో నాలుగు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ నేత గుజ్జల నగేష్‌పై హత్యాయత్నం జరిగింది. మారణాయుధాలతో కిరాతకంగా నగేష్‌పై దాడి చేశారు. పచ్చ మూకలు పట్టపగలే సాగించిన ఈ వికృత క్రీడ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నగేష్‌ను కింద పడేసి కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.

ప్రధాన నిందితుడు దగ్గుపాటి అనుచరుడు..

నగేష్‌పై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన జయరాం నాయుడు.. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరుడు కావడం గమనార్హం. అనంత పురం రూరల్‌ పంచాయతీలో జయరాం నాయుడు భూ కబ్జాలకు అంతేలేదని ఆ ప్రాంతవాసులు చెబుతారు. పంచాయితీలు, దందాల్లో ఆరితేరిన వ్యక్తి అని తెలిపారు. ఈయనపై పోలీసుస్టేషన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత నగేష్‌పై జరిగిన హత్యాయత్నంలోనూ ఈయన కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైన ఆధారాలు కూడా లభించాయి. నగేష్‌పై కిరాతకంగా దాడి చేసిన నారాయణ స్వామి అలియాస్‌ పులితో జయరాం నాయుడు తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్‌ డేటా ద్వారా స్పష్టమైంది. దాడికి అర గంట ముందు ఫోన్‌పే ద్వారా రూ.5 వేల నగదును నారాయణ స్వామికి జయరాం నాయుడు పంపినట్లు వెల్లడైంది. అలాంటి వ్యక్తికి అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ వంతపాడుతూ రెండు రోజుల క్రితం నగరంలో హల్‌చల్‌ చేయడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో మరెన్ని దారుణాలకు పచ్చ గూండాలు తెరలేపుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్‌ కేటాయించి అరాచకాలకు తెరతీసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురంలో అరాచక సంస్కృతికి నాంది పలికిన టీడీపీ

పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ బరితెగింపు

అందులో భాగంగానే వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుజ్జల నగేష్‌పై హత్యాయత్నం

ప్రధాన నిందితుడు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరుడు

నేర ప్రవృత్తి గల వ్యక్తికి టికెట్‌ ఇచ్చిన చంద్రబాబుపై ప్రజల ఆగ్రహం

ప్రశాంత నగరి..‘పచ్చ’ గూండాగిరి
1/1

ప్రశాంత నగరి..‘పచ్చ’ గూండాగిరి

Advertisement

homepage_300x250