Sakshi News home page

డీఎడ్‌ 4వ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి

Published Tue, May 7 2024 12:20 AM

డీఎడ్‌ 4వ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి

పుట్టపర్తి: జూన్‌లో జరిగే డీఎడ్‌ 4వ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు ఈ నెల 8, 9వ తేదీల్లోపు ఫీజు చెల్లించాలని బుక్కపట్నం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రవిసాగర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15,16వ తేదీలలో అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చునన్నారు.

నగదు సీజ్‌

ధర్మవరం అర్బన్‌: ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్‌ చేశారు. వివరాలు... ధర్మవరంలోని ఎర్రగుంట వై జంక్షన్‌ వద్ద బుధవారం ఉదయం వన్‌టౌన్‌ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో పికప్‌ వాహనాన్ని ఆపి తనిఖీ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామానికి చెందిన గుంతల పుల్లయ్య, నరసాపురం గ్రామానికి చెందిన శింగనమల రమేష్‌ వద్ద రూ.1,40,150 నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధారాలను వారు చూపకపోడంతో పోలీసులు సీజ్‌ చేసి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించారు.

మద్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా

అనంతపురం సెంట్రల్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోకి అక్రమ మద్యం దిగుమతి కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 25 మందిని అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ. లక్ష విలువ చేసే 136 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశామన్నారు. ఉరవకొండలో 6, కళ్యాణదుర్గంలో 5, రాయదుర్గంలో 2, అనంతపురంలో 2, తాడిపత్రిలో 4, రాప్తాడులో 2, గుంతకల్లులో 3, శింగనమలలో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా బల్క్‌ సేల్స్‌ను గుర్తించి, ఆరు కేసులు నమోదు చేశామన్నారు. ఇందుకు కారకులైన ఇద్దరు సూపర్‌వైజర్లు, మరో ఇద్దరు సేల్స్‌మెన్స్‌, ఓ వాచ్‌మెన్‌ని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. అలాగే వ్యాపార లావాదేవీల్లో నగదు తేడాలు గుర్తించి రూ. 76,340లు రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు.

Advertisement

homepage_300x250