Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గాజువాక మేనిఫెస్టో ఆవిష్కరణ

Published Tue, May 7 2024 4:40 PM

వైఎస్సార్‌సీపీ గాజువాక మేనిఫెస్టో ఆవిష్కరణ

● అన్నివర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది ● స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యం ● యువత భవితకు విజయవారధి ● ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్‌ వంతెనలు నిర్మాణానికి చర్యలు ● స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకం

అక్కిరెడ్డిపాలెం/గాజువాక : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గాజువాక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ స్థానిక మేనిఫెస్టోను ప్రకటించారు. నియోజకవర్గంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి అందిన సూచనల ప్రకారం గాజువాకలో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన గాజువాకను జాతీయ స్థాయిలో, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని మేని ఫెస్టోను తయారు చేసినట్టు చెప్పారు. స్థానిక కార్యాలయంలో మేనిఫెస్టోను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. ఉగాది నుంచి గాజువాక అభివృద్ధిపై పలువురు సలహాలు సూచనలను తీసుకొని మేనిఫెస్టోను రూపొందించామన్నారు. మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళా ఉద్యోగినులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, వ్యాపారులతో పాటు వివిధ వర్గాలతో మాట్లాడి వారి ఆలోచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన మరుక్షణం నుంచి మేనిఫెస్టోను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్‌ పులుసు జనార్దనరావు, కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, రాజాన రామారావు, ఉరుకూటి రామచంద్రరావు, ఇమ్రాన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎన్నికల అదనపు పరిశీలకుడు తిప్పల దేవన్‌ రెడ్డి, రాష్ట ప్రధాన కార్యదర్శులు ఉరుకూటి అప్పారావు, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు

● పాతగాజువాక నుంచి శ్రీనగర్‌ వరకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం ● అగనంపూడి టోల్‌గేటు తరలింపు కోసం ఎంతటి పోరాటానికై నా సిద్ధం ● గాజువాకలో మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి ● మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు ● మార్కెట్ల ఆధునికీకరణ ● భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తాం ● గెడ్డలన్నింటికీ రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం ● గంగవరం పోర్టు కాలుష్యంపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు యుద్ధప్రాతిపదికపై కాలుష్య నివారణ చర్యలు ● జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచేలా సౌకర్యాలు ● ఏటా గాజువాక ఉత్సవం నిర్వహ ణ ● సీసీ కెమెరాల ఏర్పాటు ● పర్యాటక ప్రాంతంగా యారాడ అభివృద్ధి ● తక్కువ కాలుష్యంతో కూడిన కంపెనీల ఏర్పాటు ● ఒకేషనల్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల ఏర్పాటు ● పోటీ పరీక్షల విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు ● విజయవారధి పేరుతో యువత భవిష్యత్తుకు బంగారుబాట. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లతో అనుసంధా నం ● వ్యాపారం చేయడానికి ఆసక్తి కనబర్చే యువతకు చేయూత ● పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక ● కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ● ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్‌, యాప్‌, వెబ్‌సైట్‌ ఏర్పాటు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మోదీతో చెప్పించాలి : రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీతో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయించగలరా అని అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన బీజేపీతో టీడీపీ, జనసేన అంటకాగుతూ ఇక్కడి ప్రజలను మోసం చే స్తున్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు అలుపెరగని పోరాటం చేస్తానన్నారు.

Advertisement

homepage_300x250