Sakshi News home page

మా కాలనీ బాగుపడింది

Published Tue, May 7 2024 8:00 PM

మా కా

మా కాలనీలో తాగునీటికి గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రోడ్లపై మురుగు పారి, దోమలు బెడద తట్టుకోలేకపోయాం. జగనన్న పాలనలో ఇంటింటికి మంచినీటి కొళాయి వచ్చింది. రోడ్ల మీద మురుగును సైడ్‌ డ్రెయిన్లతో మళ్లించి సమస్యను పరిష్కరించారు. బడి బాగు చేయించి, పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారు.

– బుల్లా చంద్రశేఖరరావు, ఎస్పీ కాలనీ, నెమలికల్లు

మార్పు తీసుకొచ్చారు

మా ఊరిలో ముస్లింలకు సౌకర్యంగా ఈద్గా కట్టించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో షాదీఖానా నిర్మించారు. సీసీ రోడ్లు, డొంక రోడ్డు వేసి గ్రామంలో ఎంతో మార్పు తీసుకొచ్చారు.

– షేక్‌ ఖాశిం, ముస్లిం కాలనీ, నెమలికల్లు

అభివృద్ధి చేసుకున్నాం

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సహకారంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రూ.31కోట్లతో సంక్షేమ పథకాలు, రూ.11 కోట్ల నాన్‌ డీబీటీ సాయం గ్రామస్తులకు అందింది. రూ.2.95 కోట్లతో ప్రభుత్వ భవనాలొచ్చాయి. నరుకుళ్ళపాడు సొసైటీ ద్వారా ఎరువుల గౌడౌన్‌ నిర్మించుకున్నాం.

– కోవూరి చినరాంబాబు, సర్పంచ్‌, నెమలికల్లు

మా కాలనీ బాగుపడింది
1/1

మా కాలనీ బాగుపడింది

Advertisement

homepage_300x250