Sakshi News home page

నిబద్ధతతో ఎన్నికల విధులు

Published Tue, May 7 2024 1:05 PM

నిబద్ధతతో ఎన్నికల విధులు

మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, పోలింగ్‌ రోజు వారి పాత్ర కీలకమని కలెక్టర్‌ షణ్మోహన్‌ తెలిపారు.
● పాపం.. వెంకటమ్మ !

ఈమె పేరు వెంకటమ్మ. భర్త మునెప్ప దివ్యాంగుడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రామాపురంలో నివసిస్తున్నారు. ఉన్నంతలో కుమార్తెలకు పెళ్లి చేసింది. కొన్నేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కొడుకు మరణించాడు. దీంతో కాళ్లు లేని భర్త, వంగిన నడుముతో భార్య ఇద్దరే మిగిలారు. భర్తకు దివ్యాంగ పింఛన్‌, భార్యకు వృద్ధాప్య పింఛన్‌ ప్రతి నెలా వలంటీర్ల ద్వారా ఇంటికే వస్తుండటంతో చింత లేకుండా జీవనం సాగేది. కానీ రెండు నెలలుగా ఇంటికి పింఛన్‌ రాక వీరి పరిస్థితి ఇరకాటంలో పడింది. గత నెలలో కొలమడుగులోని సచివాలయానికి వెళ్లి పింఛను సొమ్ము తీసుకున్నారు. ఈ నెలకు సంబంధించి మునెప్ప పింఛన్‌ను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే ఇచ్చారు. వెంకటమ్మ పింఛన్‌ తన బ్యాంకు ఖాతాలో జమ కావటంతో రూ 400 వందలకు ఆటో మాట్లాడుకుని మండుటెండలో భర్తతో పాటు శాంతిపురానికి వచ్చింది. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో తన పింఛను సొమ్మును తీసుకుంది. వంగిపోయి, నడవలేక యాతన పడుతున్న వెంకటమ్మను చూసిన వారు ‘ఆయ్యో పాపం’ అని సానుభూతి చూపించారు. తన లాంటి వారికి ఇంటి వద్దే పింఛన్‌ అందకుండా చంద్రబాబు కుట్రలు చేయడం అన్యాయమని వాపోతోంది.

– 8లో

Advertisement

homepage_300x250