Sakshi News home page

‘ములాఖత్‌’ వేళల్లో మార్పు

Published Tue, May 7 2024 6:35 PM

‘ములా

కడప అర్బన్‌: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం అధికారులు సవరించిన ఉత్తర్వుల మేరకు ఎండతీవ్రత, తీవ్ర వడగాల్పులు, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ఖైదీల ములాఖత్‌ వేళల్లో మార్పు తీసుకొచ్చినట్లు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ ఐ.ఎన్‌.హెచ్‌ ప్రకాష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప కేంద్రకారాగారంలోని ఖైదీలకోసం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ‘ములాఖత్‌’ (ఇంటర్వ్యూ)లో కలవొచ్చని..జూన్‌ 15 వరకు ఈ మార్పులు కొనసాగుతాయని వివరించారు.

6న జిల్లాస్థాయి

క్రికెట్‌ ఎంపికలు

కడప స్పోర్ట్స్‌: కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలోని నెట్స్‌ కేంద్రంలో ఈనెల 6వ తేదీ ఉదయం జిల్లాస్థాయి అండర్‌–23, అండర్‌–19 పురుషుల విభాగం క్రికెట్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వైఎస్‌ఆర్‌ డిస్ట్రిక్ట్‌ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్‌ తెలిపారు. అండర్‌–23 ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2001 సెప్టెంబర్‌ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. అండర్‌–19 విభాగం ఎంపికలకు 2005 సెప్టెంబర్‌ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, స్టడీ సర్టిఫికెట్‌, పదోతరగతి మార్కులిస్టు, పాన్‌కార్డు, ఒరిజినల్‌తో పాటు ఒకసెట్‌ జిరాక్స్‌ ప్రతులను తీసుకురావాలని సూచించారు.

బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం బీఈడీ, ఎంఈడీ 3వ సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వైవీయూ వీసీ చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డితో కలిసి తన ఛాంబర్‌ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 2,485 విద్యార్థులకు గాను 2,322 మంది హాజరయ్యారని, అందులో 1,964 (84.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఈడీ మూడో సెమిస్టర్‌ పరీక్షలకు 64 మంది పరీక్షలు రాయిగా 55 (85.94 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా.గంగయ్య, సీడీసీ డీన్‌ ఆచార్య రఘుబాబు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ పోర్టల్‌ను

సద్వినియోగం చేసుకోవాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌: నిరుద్యోగ యువత ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ కోసం పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గతంలోలాగా క్యూ లైన్‌లో నిలబడకుండా నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉత్తీరులలైన అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్‌ పోర్టల్‌లో ఫోన్‌ నెంబరు, ఆధార్‌కార్డు, మెయిల్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయి పూర్తి వివరాలను తమ ఇంటినుంచే మొబైల్‌లోనే రిజస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగులకు వారి మెయిల్‌ ద్వారా జాబ్‌మేళా వివరాలు, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

బందోబస్తుపై దిశానిర్దేశం

బద్వేలు అర్బన్‌ : పక్కా ప్రణాళితో ఎన్నికల బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ హాలులో గురువారం నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రబుల్‌మాంగర్లు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

‘ములాఖత్‌’ వేళల్లో మార్పు
1/1

‘ములాఖత్‌’ వేళల్లో మార్పు

Advertisement

homepage_300x250