Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 6:35 PM

No He

చిత్రంలో భార్య సాయంతో పెన్షన్‌ తీసుకునేందుకు మడకలవారిపల్లె యూనియన్‌ బ్యాంకుకు వచ్చిన ఈ వ్యక్తి పేరు ఎన్‌.పెంచలయ్య. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివాసం. కొన్నేళ్లుగా పక్షవాతంతో కాలు చచ్చుపడిపోయి ఇంటి వద్దనే వలంటీర్‌ సాయంతో పెన్షన్‌ పొందుతుండేవాడు. చంద్రబాబు పుణ్యమా అని వలంటీర్ల ద్వారా పెన్షన్‌ పంపిణీ నిలిపివేయడంతో బ్యాంకు వద్దకు వచ్చి పెన్షన్‌ తీసుకునేందుకు చాలా కష్టమవుతుందని, మాలాంటి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మండిపడుతున్నాడు.

ఎక్కడికి వెళ్లాలో తెలియదు

ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్‌ ఇస్తుండేవారు. ఇప్పుడు సచివాలయానికి వెళితే బ్యాంకు అకౌంట్‌లో పడుతుందని చెప్పారు. ఆశగా బ్యాంకు వద్దకు వెళితే బ్యాంకులో కూడా జమ కాలేదని చెప్పారు. అంతదూరం ఎండపొద్దున తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. పెన్షన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. మాలాంటి ముసలోళ్లను ఇబ్బందులు పెడితే చంద్రబాబుకు ఏమి వస్తుంది. – సుబ్బమ్మ, మడకలవారిపల్లె

మా ఉసురు తగులుతుంది

ఈ వయస్సులో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే ఎండలంతో భయంగా ఉంది. గతంలో జగను పుణ్యమా అని వలంటీర్‌ ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చినప్పుడు బాగుండేది. ఉదయం 9 గంటలకు వస్తే 12 గంటలకు పెన్షన్‌ తీసుకున్నా. చంద్రబాబుకు మాలాంటి ముసలోళ్లపైన పగ ఎందుకో. మా ఉసురు ఊరికే పోదు. –లక్షుమ్మ, చింతపుత్తాయపల్లె

కడప రూరల్‌: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ గురువారం రెండవ రోజుకు చేరింది. 2,67,492 పింఛన్లకు గాను రూ.79.10 కోట్లు అందజేయాలి. మొత్తం పింఛన్లలో 1,87,103 పింఛన్లు బ్యాంకుల ఖాతాల ద్వారా అందజేస్తారు. మిగిలిన 80,389 పింఛన్లు సచివాలయాల ద్వారా అందించడానికి చర్యలు చేపట్టారు. మొదటి రోజు బ్యాంకులకు సెలవు కావడంతో అధిక శాతం మంది పింఛన్ల సొమ్మును పొందలేకపోయారు.

బ్యాంకుల వద్దకు పరుగులు...

వలంటీర్లు లేకపోవడంతో అవ్వాతాతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం పింఛన్‌ సొమ్మును బ్యాంకుల ఖాతాలకు జమ చేసినప్పటికీ.. పండుటాకులు దూర ప్రాంతాల నుంచి బ్యాంకుల వద్దకు రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకులకు 10–15 కిలో మీటర్లు దూరం వెళ్లాలి. ఏ ఆటోలో వెళ్లినా తోడుకు ఎవరో ఒకరిని తీసుకెళ్లాలి. రానుపోను చార్జీలకే వందలు పెట్టాల్సి వచ్చింద ని వృద్ధులు వాపోయారు. పైగా ఈ ఎండల్లో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. పింఛన్ల కోసం మండుటెండల్లో వృద్ధులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

రెండు నెలలకే ఇలా.. కేవలం రెండు నెలల పాటు పింఛన్ల పంపిణీకి వలంటీర్‌లను విధుల నుంచి దూరంగా ఉంచారు. ఆ ప్రభావం పింఛన్లపై భారీగా పడింది. వలంటీర్‌లు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి జరిగేది. పింఛన్ల సొమ్ము ఎప్పుడిచ్చేది. అన్ని వివరాలు లబ్ధిదారులకు, స్ధానికులకు తెలిసేది. వలంటీర్‌లు లేకపోవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. వలంటీర్‌లు ఉండి ఉంటే మొదటి రోజే పింఛన్ల పంపిణీ 94 శాతం పైగా నమోదు అయ్యేది. ప్రస్తుత పింఛన్‌ పంపిణీ విధానంఅవ్వాతాతలకు నాటి చంద్రబాబు పాలనలో కష్టాలను గుర్తుకు తెచ్చింది.

ఈ చిత్రంలో మేనల్లుడు అయిన రామారావు మోసుకుని వస్తున్న వృద్ధురాలి పేరు పెండ్లిమర్రి లక్షుమ్మ. వయోభారంతో కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో పెన్షన్‌ పొందేందుకు గత నెల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధురాలు వాపోయింది. మాలాంటోళ్లను ఇబ్బంది పెట్టడం మంచిదా అని

ప్రశ్నించింది.

No Headline
1/5

No Headline

No Headline
2/5

No Headline

No Headline
3/5

No Headline

No Headline
4/5

No Headline

No Headline
5/5

No Headline

Advertisement

homepage_300x250