Sakshi News home page

adsolute video ad after first para

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

Published Thu, May 2 2024 1:55 PM

నేటి

పండుటాకులకు పింఛన్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు చేసిన నిర్వాకం అవ్వాతాతలకు శాపంగా మారింది. ఇదివరకు ఒకటో తేదీ వచ్చిందంటే వేకువజామునే వలంటీర్‌లు తలుపు తట్టి ఆప్యాయంగా పలకరించి పింఛన్‌ నగదును అందజేసేవారు. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు వచ్చాయి. గత నెల సచివాలయల్లో పింఛన్ల పంపిణీ చేయగా.. ఈ సారి బ్యాంకుల్లో జమ కానున్నాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది.

కడప రూరల్‌: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం పింఛన్లు 2,67,492కు గాను అందులో 1,87,103 పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే 80,389 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్‌ నగదును అందజేసేలా చర్యలు చేపట్టారు.

సచివాలయాలకు వెళ్లడానికే

ఇబ్బందులు పడ్డారు..

చంద్రబాబు మిత్ర బృందం వలంటీర్‌ వ్యవస్ధపై ఫిర్యాదులతో దాడి చేశారు. వారు పండుటాకులన్న జాలి కూడా చూపలేదు. దీంతో ఎన్నికల కమీషన్‌ విధుల నుంచి వలంటీర్‌లు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభావం సామాజిక పింఛన్ల పంపిణీపై పడింది. అంతకు ముందు వలంటీర్‌లు పొద్దు పొడవక ముందే అవ్వాతాతల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించే వారు..పింఛన్‌ నగదును అందజేసే వారు. చంద్రబాబు కారణంగా వలంటీర్‌లు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఏప్రిల్‌ 1వ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీలో అధిక శాతం మందికి సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్మును అందజేశారు. భగభగ మండే ఎండల్లో పండుటాకులు సచివాలయాలకు వెళ్లలేక చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా చేపట్టే పింఛన్ల పంపిణీలో అత్యధిక శాతం మందికి పింఛన్‌ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ఎక్కడో మారు మూల పల్లెలో ఉండే వృద్ధులు ఇతర కేటగిరీకి చెందిన వారు తమ గ్రామం నుంచి దాదాపు 10 కిలో మీటర్ల పైగా దూరంలో ఉండే బ్యాంకు వద్దకు వెళ్లి పింఛన్‌ నగదును తీసుకోవడం అటే అది ఎంత వరకు సాధ్యం అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఎంత మంది దగ్గర ‘ఏటీఎం కార్డులు’ పే ఫోన్‌ సౌకర్యం ఉంటుందనేది ప్రశ్నార్ధకమే. కాగా వారు వ్యయ ప్రయాసాలకు ఓర్చి బ్యాంకులకు వెళ్లి పింఛన్‌ సొమ్మును తెచ్చుకోవాలంటే ఇబ్బందులు పడక తప్పదనే వాదన వినిపిస్తోంది.

మొత్తం పింఛన్లు 2,67,492

అందులో 1,87,103 పింఛన్లు బ్యాంకు ఖాతాలకు జమ

80,389 పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ

అవ్వాతాతలకు తప్పని తిప్పలు

పంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం...

పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం. బ్యాంకుల ద్వారా కొంతమందికి, అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే వారికి ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం.

– ఆనంద్‌నాయక్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ

నేటి నుంచి పింఛన్ల పంపిణీ
1/1

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

Advertisement

adsolute_video_ad

homepage_300x250