Sakshi News home page

adsolute video ad after first para

బస్సు యాత్ర విజయవంతం

Published Fri, Apr 19 2024 1:25 AM

ఉరిమే ఉత్సాహం.. జై జగన్‌ అంటూ.. - Sakshi

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

తణుకు అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్‌కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్‌ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్‌కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్‌ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు.

యాత్ర సాగిందిలా..

పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్‌ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్‌, చెముడులంక, మడికి జంక్షన్‌, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్‌, ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ ఏరియా, బొమ్మూరు సెంటర్‌ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్‌ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్‌ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్‌ నుంచి తాడితోట, షెల్టన్‌ సెంటర్‌, దేవీచౌక్‌, పేపరు మిల్లు, కాతేరు గామన్‌ బ్రిడ్జి, ది వాన్‌చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు.

అడిగడిగో జగన్‌ మావయ్య.. పిల్లల కేరింతలు
1/2

అడిగడిగో జగన్‌ మావయ్య.. పిల్లల కేరింతలు

2/2

Advertisement

adsolute_video_ad

homepage_300x250