Sakshi News home page

adsolute video ad after first para

document.addEventListener("DOMContentLoaded", function() { var newsContent = document.querySelector(".news-story-content"); var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p")); var firstParagraph = paragraphs.findIndex(function(paragraph) { return !paragraph.closest('.bullet_list'); },1); if (firstParagraph) { var secondParagraph = paragraphs[firstParagraph + 1]; var script = document.createElement("script"); script.async = true; script.id = "AV62ff84d96d945e7161606a7a"; script.type = "text/javascript"; script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…"; secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling); } });

ఉప్పొంగిన జనగోదావరి

Published Fri, Apr 19 2024 1:25 AM

- - Sakshi

మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడి

రావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్‌

సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది.

ఒకరోజు విరామం తర్వాత

శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్‌ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్‌ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్‌ హెల్ప్‌’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్‌, తణు కు వై.జంక్షన్‌, శర్మిష్ట్ట జంక్షన్‌, ఉండ్రాజవరం జంక్షన్‌, పెరవలి వై.జంక్షన్‌ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్‌ ను చూసి జై జగన్‌, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు.

సత్వరమే స్పందించి..

పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్‌ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్‌ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్‌ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

సిద్ధాంతం.. ఘన స్వాగతం

గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్‌ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్‌ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్‌ జార్జ్‌ ప్రైజ్‌ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్‌ పక్కన ఉన్నారు.

అదృష్టంగా భావిస్తున్నా..

సీఎం జగన్‌ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను.

– మైలే డేవిడ్‌ జార్జ్‌ ప్రైజ్‌, పెనుగొండ

సావధానంగా విన్నారు

కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్‌కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు.

– వేండ్ర మోహనరావు, సిద్ధాంతం

అడుగడుగునా అమితాదరణ

సీఎం జగన్‌ బస్సు యాత్రకు అపూర్వ స్పందన

జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం

జై జగన్‌ నినాదాలతో మార్మోగిన హైవే

ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి

పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

జయహో జగన్‌.. వైఎస్సార్‌సీపీ జెండాలతో సందడి
1/11

జయహో జగన్‌.. వైఎస్సార్‌సీపీ జెండాలతో సందడి

దిష్టి తీసి.. ఆశీర్వదించి.. గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న అక్కాచెల్లెమ్మలు
2/11

దిష్టి తీసి.. ఆశీర్వదించి.. గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న అక్కాచెల్లెమ్మలు

మమతానురాగాలతో.. 
సీఎం జగన్‌ను పలకరిస్తున్న ఓ సోదరి
3/11

మమతానురాగాలతో.. సీఎం జగన్‌ను పలకరిస్తున్న ఓ సోదరి

విజయం మనదే.. బ్యానర్‌లతో సంఘీభావం
4/11

విజయం మనదే.. బ్యానర్‌లతో సంఘీభావం

అన్నొచ్చాడు.. భారీ ఫ్లెక్సీతో మద్దతిస్తూ..
5/11

అన్నొచ్చాడు.. భారీ ఫ్లెక్సీతో మద్దతిస్తూ..

మా నమ్మకం నువ్వే జగన్‌.. యువతుల కేరింతలు
6/11

మా నమ్మకం నువ్వే జగన్‌.. యువతుల కేరింతలు

యువోత్సాహం.. వైఎస్సార్‌సీపీ జెండాలతో..
7/11

యువోత్సాహం.. వైఎస్సార్‌సీపీ జెండాలతో..

ఆలకిస్తూ.. అభయమిస్తూ..
దివ్యాంగుడికి భరోసా ఇస్తున్న సీఎం జగన్‌
8/11

ఆలకిస్తూ.. అభయమిస్తూ.. దివ్యాంగుడికి భరోసా ఇస్తున్న సీఎం జగన్‌

ఆనందహేల: బస్సులోని ప్రయాణికులు
9/11

ఆనందహేల: బస్సులోని ప్రయాణికులు

10/11

11/11

Advertisement

adsolute_video_ad

homepage_300x250