Sakshi News home page

adsolute video ad after first para

వైఎస్సార్‌ సీపీలో చేరిన కూటమి నేతలు

Published Fri, Apr 19 2024 1:20 AM

- - Sakshi

తాడేపల్లిగూడెం అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీలోకి కూటమి నేతలు వలసలు కొనసాగుతున్నాయి. గురువారం పలు చోట్ల టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన గమిని సుబ్బారావు గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గమినిని మంత్రి కొట్టు వైఎస్సార్‌ సీపీ కండువా వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ వైస్‌ చైర్యన్‌, వ్యాపారవేత్త గమిని సుబ్బారావు వైఎస్సార్‌ సీపీలో చేరడం శుభసూచకమన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాతంగా వ్యాపారాలు చేసుకోవాలి, అందరితోను స్నేహంగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వెళతారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. ఇది చూసిన కూటమి నేతలు అయోమయంలో ఉన్నారన్నారు. గమని సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై జగన్‌ సమక్షంలో పార్టీలో చేరానన్నారు. ప్రజల భవిష్యత్తు జగన్‌మోహనరెడ్డి అని సుబ్బారావు అన్నారు. అప్సడా వైస్‌ ఛైర్మన్‌ వడ్డి రఘురాం మాట్లాడుతూ గమని సుబ్బారావు వంటి వ్యక్తులు వైఎస్సార్‌సిపిలోకి చేరడం సంతోషకరమన్నారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.

పాలకొల్లులో..

పాలకొల్లు సెంట్రల్‌: సీఎం వైఎస్‌ జగన్‌ పాలన మెచ్చే ఇతర పార్టీల నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గూడాల గోపి అన్నారు. పాలకొల్లులో గురువారం 18వ వార్డు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 25 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికి గుడాల గోపి వైఎస్సార్‌ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు ఇన్‌చార్జి రామాంజుల పెద్దమదు, ఖండవల్లి వాసుల సమక్షంలో పసుపులేటి రమేష్‌, పసుపులేటి సుధ, పసుపులేటి జాన్‌,కొండేటి హనోక్‌, పసుపులేటి దివ్య, పసుపులేటి రాజేష్‌, కౌంజు మరేష్‌, కొల్లి పాప, బెజవాడ లక్ష్మీ, కంకిపాటి శ్రీదర్‌, వడ్లపాటి పల్లంరాజు, తెన్నేటి రాజేష్‌బాబు, తానేటి బ్రూస్‌రామ్‌, కానూరి రమణ, అనపర్తి రవిబాబుల కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ పార్టీలో చేరారు. సంచారజాతుల కార్పోరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న, యడ్ల తాతాజీ, గుమ్మాపు వరప్రసాద్‌, పాలపర్తి కృపానాథ్‌, సనమండ సురేష్‌, పసుపులేటి వీరాస్వామి, రామాంజు చిన్నమధు, కె.జక్కరయ్య, ఎం.జయరావు పాల్గొన్నారు.

గుండుగొలనులో..

భీమడోలు: గుండుగొలనుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి వైఎస్సార్‌ సీపీ భీమడోలు మండల ఇన్‌చార్జి పుప్పాల కార్తీక్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఐదేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షించాయని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నామని వారంతా ప్రకటించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, సొంతింటి కలను సాకారం చేశారన్నారు. అనంతరం పుప్పాల కార్తీక్‌ సమక్షంలో టీడీపీకి చెందిన వెలగల కృష్ణ, పి.సతీష్‌, పి.ప్రసాద్‌, రెడ్డి ప్రసాద్‌, విశాఖ పవన్‌, విశాఖ రంగ, గోంగాడ శివ, గుమ్మడి దుర్గారావు, ఆళ్ల దుర్గారావు, ఆళ్ల హేమంత్‌ తదితరులకు పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ యాదవ్‌లను గెలిపించేందుకు యుద్ద సైనికుల్లా పని చేయాలని కార్తీక్‌ వారిని కోరారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు ముదుండి సూర్యనారాయణరాజు, నాయకులు జహీర్‌, పసుపులేటి శ్రీను, వార్డు సభ్యుడు గొటికల మురళీ, నాయకులు నల్ల శ్రీను, మర్రాపు బాబు, వగ్వాల రామన్‌ పాల్గొన్నారు.

1/2

వైఎస్సార్‌ సీపీలో చేరిన కూటమి నేతలతో గుడాల గోపి
2/2

వైఎస్సార్‌ సీపీలో చేరిన కూటమి నేతలతో గుడాల గోపి

Advertisement

adsolute_video_ad

homepage_300x250