Sakshi News home page

బీర్లు.. నో స్టాక్‌

Published Tue, May 7 2024 3:20 AM

బీర్ల

15 రోజుల నుంచి తీవ్రమైన కొరత

మహబూబ్‌నగర్‌ క్రైం: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్‌ పెరిగింది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,02,961 కాటన్ల బీర్ల విక్రయాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు ఇటీవల ప్రొడక్షన్‌ సక్రమంగా లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇప్పటికే జిల్లాలో చాలావరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే బీర్లకు డిమాండ్‌ ఉంటుంది. కానీ, ఇప్పుడే కొరత తలెత్తడంతో ఇటు మందుబాబులు, అటు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో–స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో స్టాక్‌ వచ్చిన పది నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. తిమ్మాజిపేట, కొత్తకోట డిపోల నుంచి ఒక్కో దుకాణానికి 2–5 కేసుల వరకు మాత్రమే బీర్లు ఇస్తున్నారు. ఇచ్చిన స్టాక్‌ నిమిషాల వ్యవధిలో అయిపోవడంతో కష్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్‌కు తగ్గట్టుగా బీర్లు లేకపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. విపరీతంగా పెరిగిన ఎండలకు తోడు ఇటీవల లారీల సమ్మె జరగడంతో బీర్ల సరఫరా, ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటి అక్కడక్కడ కొంత వరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు.

నో స్టాక్‌ బోర్డులు

ఒక్క ఏప్రిల్‌లోనే ఉమ్మడి జిల్లాలో 4,02,961 కాటన్లవిక్రయం

ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి

అంటున్న ఎకై ్సజ్‌ అధికారులు

ఉత్పత్తి తక్కువ కావడం వల్లే..

గతంలో ప్రతి ఏడాది వేసవి కోసం డిసెంబర్‌, జనవరి నెలల్లో ఓవర్‌ టైం పనిచేసి బీర్లు అధికంగా ఉత్పత్తి చేసి స్టాక్‌ చేసేవాళ్లు. ఈసారి అలా చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడింది. ఈ నెల చివరి నాటి వరకు జిల్లాలో బీర్ల కొరత ఉంటుంది. ప్రొడక్షన్‌ తక్కువ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది.

– విజయ్‌భాస్కర్‌రెడ్డి,

అసిస్టెంట్‌ కమిషనర్‌, మహబూబ్‌నగర్‌

బీర్లు.. నో స్టాక్‌
1/1

బీర్లు.. నో స్టాక్‌

Advertisement

homepage_300x250