Sakshi News home page

IPL 2024: స‌చిన్ షాట్‌ను కాపీ కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌.. వీడియో వైర‌ల్‌

Published Thu, Apr 11 2024 5:46 PM

Shubman Gill Copies Tendulkar As He Replicates Straight Six Vs Avesh - Sakshi

ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ‍మెగా ఈవెంట్‌లో భాగంగా బుధవారం జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు.

అయితే గిల్‌ తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ షాట్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచాడు. గిల్‌ తన షాట్‌తో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను గుర్తు చేశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ వేసిన అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని శుబ్‌మన్‌ అద్భుతమైన ఆన్-డ్రైవ్‌ షాట్‌ ఆడి సిక్స్‌గా మలిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్‌ వాట్‌ఏ షాట్‌ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా  1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్‌లో సచిన్‌ విధ్వంసం సృష్టించాడు. సచిన్‌ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 143 పరుగులు చేశాడు.

Advertisement

homepage_300x250