Sakshi News home page

adsolute video ad after first para

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు

Published Thu, Apr 18 2024 10:30 AM

కాంగ్రెస్‌లో చేరిన వారితో ఎమ్మెల్యే సంజీవరెడ్డి - Sakshi

ఎస్పీ బాలస్వామి

మెదక్‌మున్సిపాలిటీ: నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఇందుకోసం సెంట్రల్‌ ఫోర్స్‌, ఆర్ముడ్‌, సివిల్‌ ఫోర్స్‌తో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌ నుంచి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

హామీలను అమలు చేస్తాం

పెద్దశంకరంపేట(మెదక్‌): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉత్తులూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సురేష్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మధు, సీనియర్‌ నాయకులు నారాగౌడ్‌, సంగమేశ్వర్‌, రాంచందర్‌, పెరుమాండ్లుగౌడ్‌, ఎంపీటీసీ రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈదురుగాలులతో

కూడిన వర్షం

హవేళిఘణాపూర్‌(మెదక్‌)/నిజాంపేట: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హవేళిఘణాపూర్‌ మండలంలోని గాజుల్వయి తండాలో ఈదురుగాలులకు కరెంట్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తండావాసులు రాత్రంతా చీకట్లోనే గడిపారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

సరిహద్దుల్లో పటిష్ట నిఘా

కంగ్టి(నారాయణఖేడ్‌): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ రఫీయొద్దీన్‌ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్‌వాడి చెక్‌పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ సాయులు, ఏఈఓ సంతోష్‌ ఉన్నారు.

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
1/3

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

విరిగి నేలవాలిన విద్యుత్‌ స్తంభం
2/3

విరిగి నేలవాలిన విద్యుత్‌ స్తంభం

3/3

Advertisement

adsolute_video_ad

homepage_300x250