Sakshi News home page

Japan Earthquake: జపాన్‌లో కంపించిన భూమి..

Published Thu, Apr 4 2024 10:55 AM

Earthquake Happend Near East Coast Of Japan - Sakshi

టోక్యో: తైవాన్‌ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.

కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్‌లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్‌లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్‌ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. తైవాన్‌లో బుధవారం రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్‌ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి.

తైవాన్‌లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు..

Advertisement

homepage_300x250