Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అక్రమ వలసలకు చెక్‌.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్‌

Published Tue, Apr 23 2024 9:11 PM

Britain Passes Illegal Migrants Deportation Bill - Sakshi

లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్‌ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్‌23) ‘సేఫ్టీ ఆఫ్‌ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ  ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు.

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. 

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250